సోమనాథ్ ద్వారక యాత్రకు నిర్మల్ నుండి ఆర్టీసీ బస్సు
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ(Nirmal RTC) డిపో నుంచి ఆరు జ్యోతిర్లింగాలతో పాటు పలు పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్టు నిర్మల్ డిఎం పండగ తెలిపారు. ఈ యాత్రలో భాగంగా నాందేడ్ గురుద్వారా, భద్ర మారుతి, ఎల్లోరాలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, శని శింగణాపూర్, షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్, నిష్కలంక మహాదేవ్, సోమనాథ్ జ్యోతిర్లింగం, ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించుకోనున్నారని తెలిపారు.
ఈ యాత్ర నవంబర్ 2న తిరిగి నిర్మల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రయాణికుల ఆదరణతో నిర్మల్ డిపో పరిధిలో పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక యాత్ర బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాణికులు వీటిని విజయవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. తదుపరి నవంబర్‌లో కర్ణాటక పుణ్యక్షేత్రాల యాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.