రామగిరిలో ప్రజావాణి.. 8 ఆర్జీల స్వీకరణ
రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండల పరిషత్ కార్యాలయం(Ramagiri Mandal Parishad Office)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి(Prajavani Program) వివిధ శాఖలకు చెందిన 14 మంది మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి 8 ఆర్జీలను స్వీకరించారు. వాటిలో విద్యుత్ శాఖకు సంబంధించి ఒకటి, రెవెన్యూ శాఖకు సంబంధించి మూడు, ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒకటి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు ఆర్జీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులు వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ రాణి, డీటీ మానస, ఎంపీఓ సమ్మిరెడ్డి, పీఆర్ఏఈ వరలక్ష్మి, ఏపీఓ మౌనిక, ఏపీఎం పద్మ, పోలీస్ శాఖ ఏఎస్ఐ స్వామి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.