వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన
మంథని,(విజయక్రాంతి): వన్యప్రాణి వారోత్సవాల(Wildlife Week Celebrated) సందర్భంగా మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Manthani Degree College)లో అటవీ శాఖ మంథని రేంజ్ సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల(Students)కు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. వన్యప్రాణుల సంరక్షణపై క్విజ్ నిర్వహించి, అనంతరం విద్యార్థులు, కళాశాల సిబ్బందితో సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.
యువతలో పర్యావరణ పరిరక్షణ(Environmental Protection), వన్యప్రాణుల సంరక్షణపై బాధ్యతాయుతమైన భావన పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని అటవీ శాఖ రేంజ్ అధికారి ఎం. వినయ్ నాయక్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోశయ్య, డిప్యూటీ రేంజ్ అధికారి పి. దేవదాస్, సెక్షన్ అధికారులు మంగీలాల్, రవి, షా ఖాన్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.