గంజాయి నిర్మూలనకు కుభీర్ పోలీసుల ప్రత్యేక చర్యలు
రెండు నిమిషాల్లో గంజాయి వినియోగాన్ని గుర్తించే యూరిన్ టెస్ట్ కిట్లు
కుభీర్ పోలీస్ స్టేషన్లో అందుబాటులో వున్నా యూరిన్ డ్రగ్స్ కిట్లు
కుభీర్ సెప్టెంబర్ 06(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎస్పీ(SP) ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు కుభీర్ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేకమైన యూరిన్ డ్రగ్ టెస్ట్ కిట్లు(Urine drug test kits) అందుబాటులోకి వచ్చినట్లు కుభీర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ టెస్ట్ ద్వారా గంజాయి సేవించినట్లు అనుమానం ఉన్న వ్యక్తుల మూత్ర నమూనాలను పరీక్షించి, సుమారు రెండు నిమిషాల్లో ఫలితాలను తెలుసుకోవచ్చని ఎస్‌ఐ తెలిపారు. గంజాయి వినియోగాన్ని అరికట్టడంతో పాటు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.






