కలెక్టరేట్లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
17-09-2026 | 04:44pm
నిర్మల్ ,సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): కలెక్టరేట్(Collectorate)లోని సమావేశ మందిరంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ జయంతి వేడుకలలో డిప్యూటీ కలెక్టర్ రాకేష్, బిసి, ఎస్సీ సంక్షేమ శ్రీనివాస్ సత్యనారాయణ రెడ్డి బి రవి. కత్రోజే అశోక్ చారి నరేష్ వెంకటరమణ అధికారులు శ్రీనివాస్, దయానంద్, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.