ఓట్ చోరీ కా నహీ.. రాహుల్ కీ అకల్ చోరీ కా!
నిజామాబాద్, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి) : దేశంలో ఎలక్షన్ కమిషన్‌లో చీఫ్ కమిషనర్,ఇద్దరు కమిషనర్ల మధ్య భిన్నభిప్రాయాలపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపూరి కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసారు.ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఓట్ చోరికి నహి అపార్టీ నేత రాహుల్ గాంధీ ఆకల్ కి హై అన్నారు.దేశంలో ఎలక్షన్ కమిషన్ అన్నది సర్వ స్వతంత్ర సంస్థ అని గుర్తు చేసారు.చీఫ్ కమిషనర్‌కు ఇద్దరు కమిషనర్లకు సర్‌పై భిన్నభిప్రాయాలు సాధారణం అన్నారు. ప్రజాస్వామ్యంలో అది సహజమని కమిషనర్లు తీసుకునే నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ అమలు చేసే విషయం కాంగ్రెస్‌కు తెలియదా అన్నారు.
చరిత్రలో ఒకప్పటి ఎలక్షన్ కమిషనర్లుగా పని చేసిన టీఎన్ శేషన్ కాంగ్రెస్ పార్టీలో చేరారని,మాజీ కమీషనర్ ఎంఎస్ గిల్ కేంద్ర మంత్రిగా యూపిఏ ప్రభుత్వంలో పని చేయలేదా అని గుర్తు చేసారు.రాహుల్ గాంధీ కోరినట్టు రోహింగ్యలకు ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయను కానీ భారతీయులకు మాత్రం ఓటు హక్కు ఇప్పిస్తానని అన్నారు. మహేష్ కుమార్ నిజామాబాద్ వాసి అని అతనికి తానే స్వయంగా ఓటు హక్కు ఇప్పిస్తాను అన్నారు.