శాస్త్రి, గాంధీ ఆశయాలు ఆదర్శనీయం
మంథని లో వారి జయంతి వేడుకల్లో బిజెపి పట్టణ అధ్యక్షుడు సంతోష్
మంథని, అక్టోబర్ 2 (విజయక్రాంతి): భారత మాజీ ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri), జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi) జయంతి వేడుకలను మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 1965 భారత్–పాకిస్థాన్ యుద్ధ సమయంలో దేశాన్ని ధైర్యంగా నడిపించిన లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిందన్నారు. ఆయన ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అహింసా మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీ చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండపాక సత్యప్రకాష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోగోజు శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ నాంపల్లి రమేష్, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, పట్టణ ఉపాధ్యక్షుడు బొల్లంపల్లి లక్ష్మణ్, కార్యదర్శి పార్వతి విష్ణు, కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.