బెజ్జుర్ మండల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక
బెజ్జుర్ అక్టోబర్ 2 (విజయ క్రాంతి ):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండల కేంద్రంలో తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిల్లా అధ్యక్షులు చెండ్యాల రాంచందర్ అధ్యక్షతన జిల్లా ప్రధాన కార్యదర్శి పోలోజు సంతోష్ కుమార్, కోశాధికారి జాడి సుకుదేవ్ కార్యవర్గ సభ్యులు పెంటపర్తి సుమన్ ఆధ్వరంలో బెజ్జుర్ మండల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమక్షంలో మండల నూతన కార్యవర్గాన్ని పెన్నుకున్నట్లు తెలిపారు.
మండల అధ్యక్షులు: ఆత్రం బక్కయ్య
కార్యనిర్వాహణ అధ్యక్షులు: గోరంట్ల వసంత్
ప్రధాన కార్యదర్శి: ఖాజరహీముద్దీన్
కోశాధికారి: అడ్డూరి వసంత్
సమావేశంలో తీసుకున్న ముఖ్య తీర్మానాలు:
1. మండలంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం సాగించడం.
2. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, ఈఎస్ఐ/పీఎఫ్ వంటి ప్రయోజనాలు అందేలా పోరాటం చేస్తామని తెలిపారు.