కేటీఆర్‌కు దసరా శుభాకాంక్షలు

22-10-2026 | 07:40pm

హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో మర్యాదపూర్వక భేటీ

పెద్దపల్లి, అక్టోబర్ 22 (విజయ క్రాంతి) విజయదశమి దసరా పండుగను(Vijayadashami Dussehra Festival) పురస్కరించుకుని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి, యువ నాయకుడు దాసరి ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.

ఈ భేటీలో పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపి, విజయాలను అందించాలని డాక్టర్ దాసరి మమతా రెడ్డి, దాసరి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు