వివేకానంద హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు
సుల్తానాబాద్ , అక్టోబర్, 09 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని వివేకానంద హై స్కూల్(Vivekananda High School) నందు ముందస్తు బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) శుక్రవారం ఘనంగా జరుపుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ భూసారపు బాలకిషన్ మరియు ఉమారాణి కరస్పాండెంట్ రవీందర్ ప్రిన్సిపాల్ సుజాత మరియు వైస్ ప్రిన్సిపల్ పెన్నింటి రజిత మరియు అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది, కరస్పాండ్ రవీందర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా తెలంగాణ జాతి ఆడపడుచులందరూ జరుపుకోవడం జరుగుతుందని అన్నారు, ప్రకృతిని కొలిచేటువంటి ఒక గొప్ప పండుగ అని తీరొక్క పువ్వులతోటి తయారు చేసే బతుకమ్మ గౌరీ మాతకు ప్రతిరూపం అని అన్నారు.