గాంధీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

02-10-2026 | 03:24pm

మంథని లో గాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ 

మంథని, అక్టోబర్ 2(విజయ క్రాంతి): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంథని గాంధీ చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ (Congress party)ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయిలి ప్రసాద్ మాట్లాడుతూ..

అహింస, సత్యాగ్రహ మార్గాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారని గుర్తుచేశారు. అంటరానితనం నిర్మూలన, సామాజిక సమానత్వం, పరిశుభ్రత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. గాంధీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు