కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
వ్యాపారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి
మంథని, నవంబర్ 6 (విజయక్రాంతి): మంథని పట్టణంలో(Manthani town) నిర్మిస్తున్న నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణ(Construction of a vegetable market) పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్(Municipal Chairman Vodnala Srinivas), వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మార్కెట్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తూ, పనుల్లో జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నూతన మార్కెట్ అందుబాటులోకి వస్తే కూరగాయల వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు పట్టణ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. మార్కెట్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, వ్యాపారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మంథని పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తోందని చైర్మన్ తెలిపారు.