ఆపదలో అండగా మంత్రి శ్రీధర్ బాబు

03-10-2026 | 01:03pm

మంథని, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మంథని మండలం ఖాన్సాయిపేట గ్రామానికి చెందిన మెరుగు రాజయ్య అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం కోరగా.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీ(LOC)ని మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆస్పత్రి సహాయకులు ఎల్‌ఓసీని రాజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. 

వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందించిన మంత్రి శ్రీధర్ బాబుకు రాజయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు