ఒక్కరికి ఫీవర్.. ఇంట్లో అందరికీ టెన్షన్!

03-10-2026 | 09:39am

ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు(Viral Fevers) విజృంభిస్తున్నాయి. జ్వరం బారిన పడుతున్న ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి(Headache)తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరికి జ్వరం వస్తే.. ఇంట్లోని ఇతర కుటుంబసభ్యులకు కూడా వైరల్ ఫీవర్(Viral Fever) వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో వైరల్ ఫీవర్స్‌పై ప్రత్యేక సర్వే(Special Survey) నిర్వహిస్తున్నారు. గత నెలలోనే జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడినట్లు సర్వేలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు