శ్రీసిటీలో బాయిలర్ బ్లాస్ట్.. ఇద్దరి ప్రాణాలు బలి!
తిరుపతి(Tirupati) జిల్లాలోని సత్యవేడు శ్రీ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్(Boiler) ఒక్కసారిగా పేలడంతో తీవ్ర కలకలం రేగింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నైట్ షిఫ్ట్(Night Shift)లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు పేలుడు ధాటికి చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పేలుడు ధాటికి పరిశ్రమలో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు(Investigation) చేస్తున్నారు. ఘటన సమయంలో పరిశ్రమలో ఎంతమంది కార్మికులు ఉన్నారు.. మరెవరైనా గాయపడ్డారా అనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.