కాక విగ్రహానికి నివాళులు

05-10-2026 | 05:36pm

కాక వెంకట స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (Former Union Minister Gaddam Venkataswamy) 97వ జయంతి సందర్బంగా  రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు(MLA Vijayaramana Rao) సోమవారం సుల్తానాబాద్ లో  కాక వెంకట స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ , మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ , మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు , మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత , టీపీసీసీ ఎస్సీ  డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యదర్శి ఆరెపల్లి రాహుల్,  రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ  నీరటి శంకర్ ముదిరాజ్ , కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు, మండలం అధ్యక్షులు పెద్ద ఎత్తున పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు