చిన్నారిపై అత్యాచారం..

25-09-2026 | 05:41pm
  1. హత్య  కేసులో నిందితుడికి జీవిత  ఖైదు
  2. విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి....

సుల్తానాబాద్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి); పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ(Katnapalli village) శివారులోని ఒక రైస్ మిల్లు సమీపంలో ఆరేళ్ల పాపపై అత్యాచారం, హత్య చేసిన సంఘటనపై నిందితుడు బీహార్ కు చెందిన వినోద్ మాజీ కు జీవితాంతం జైలు శిక్ష. 28 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్వప్న రాణి (Court Judge Swapna Rani)తీర్పు చెప్పారని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి(Peddapalli DCP Bhukya Ram Reddy) తెలిపారు.

శుక్రవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 13,  2024 న రైస్ మిల్లు సమీపంలో జరిగిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది అన్నారు, ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజ్, స్థానికుల విచారణతో కేసును పోలీసులు చేదించారన్నారు, నిందితుడికి శిక్ష పడేలా  పోలీసులు ఆధారాలు సేకరించారని,  నేరాలకు పాల్పడి తప్పించుకోవాలని చూస్తే చట్టం ఊరుకోదు అన్నారు.  

నేరం చేసిన వారికి తప్పక శిక్ష పడుతుందని డీసీపీ భూక్యా రామ్ రెడ్డి తెలిపారు , నిందితునికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన ఎసిపి గజ్జి కృష్ణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ లను డీసీపీ రామ్ రెడ్డి ఘనంగా సన్మానించారు, ఈ సమావేశంలో పెద్దపల్లి ఎసిపి గజ్జి కృష్ణ, సీఐ లు పొన్నమనేని రంజిత్ రావు, ప్రవీణ్ కుమార్, ఎస్సై లు చంద్ర కుమార్, అశోక్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు