గణేష్ నిమజ్జనానికి 400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో(Kagaznagar, Asifabad town) నిర్వహించనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు(Ganesh Immersion Procession) జిల్లా పోలీస్ శాఖ(District Police Department) పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ నితికా పంత్(District SP Nitika Pant) ఐపీఎస్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు.విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు(Police officials), సిబ్బందికి ఎస్పీ బ్రీఫింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, మసీదులు, నిమజ్జన ప్రదేశాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
బందోబస్తులో(Security arrangements) ఏఎస్పీ ఒకరు, డీఎస్పీలు ఇద్దరు, సీఐలు 12 మంది, ఎస్సైలు 28 మంది పాల్గొంటున్నారు.నిమజ్జన శోభాయాత్రను ఆరు సెక్టార్లు, 11 క్లస్టర్లుగా విభజించి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నివారణ, వాహనాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సీసీటీవీల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్పీ కోరారు.