రైతుల భూములు లాక్కోవద్దు

25-09-2026 | 06:39pm

గుడిమల్కాపురం రైతులు

సంస్థాన్ నారాయణపూర్,సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం(Government) సేకరించాలనుకుంటున్న 175 ఎకరాల భూమిలో రైతుల భూములను లాక్కోవద్దని నారాయణపురం మండలం గుడిమల్కాపురం రైతులు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి (Tahsildar Srinivas Reddy)వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని రెండెకరాల నుండి మూడు ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న రైతు కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని భూమిని లాక్కుంటే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పేదల పొట్ట కొట్టకుండా ప్రభుత్వ భూమిని సేకరించుకోవాలని రైతుల కుటుంబాలను కాపాడాలని ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుల అఖిలపక్ష కమిటీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు