8 వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
సుల్తానాబాద్, నవంబర్ 06 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని 8వ వార్డు అశోక్‌నగర్ పాఠశాలలో(Ashoknagar School) శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం(Distribution program for smart ration cards) నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను వార్డు కౌన్సిలర్ చింతల రాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని అమలు చేస్తోందన్నారు.
వీటి ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగడంతోపాటు అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.ఈ కార్యక్రమంలో జీపీఓ మహేందర్‌రెడ్డి, అంగన్వాడీ టీచర్ నల్ల శ్రీలత, రమ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక రాజేశం, బోగిరి విజయకుమార్, వార్డు ప్రజలు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.