హాఫ్ మారథాన్‌లో సత్తా చాటిన సుల్తానాబాద్ పోలీసులు
సుల్తానాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన హాఫ్ మారథాన్(Half Marathon)లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై చంద్రకుమార్(SI Chandrakumar)తో పాటు మొత్తం 12 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని విజయవంతంగా 21,1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పరుగును పూర్తి చేశారు.
పోలీసు విధులతో పాటు శారీరక దృఢత్వం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు క్రీడలు, పరుగు వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. హాఫ్ మారధాన్ లో ఎస్సై చంద్రకుమార్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ మహేందర్, కానిస్టేబుళ్లు దేవరాజు, సదానందం, గణేష్ ,వెంకటేష్, రమేష్, అరుణ్ ,హరీష్, యుగంధర్, చక్రవర్తి, విను స్టర్ ,అశోక్ లు పాల్గొని విజయవంతంగా పూర్తి చేసి, మెడల్స్ అందుకున్నారు.