విలాసాగర్‌లో రెండెకరాల్లో వెంచర్
- ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
- వ్యవసాయ భూమిలో వెలిసిన ప్లాట్లు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాసుల వర్షం
బోయినపల్లి: అక్టోబర్ 2 ( విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) బోయినపల్లి మండలం విలాసాగర్(Vilasagar) లో వ్యవసాయ భూమిలో(Agricultural land) రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు(Real estate developers and plots) పెట్టి విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా పెద్ద మొత్తంలో గండిపడి ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. అక్రమ సంపాదన పై ఆశపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు పెట్టి విక్రయిస్తు న్నారు. రూ లక్షల్లో అక్రమంగా ఆర్జిస్తున్నా రు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉ దాసీనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విలాసాగర్ లో రైతు నుం చి వేములవాడ పట్టణ నానికి చెందిన ఓ రి యల్ ఎస్టేట్ వ్యాపారి రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి విలాసాగర్ లోని నడి ఒడ్డున ఇళ్ల మధ్యలో కలదు. ప్రభుత్వ నిబంధన ప్రకా రం కొనుగోలు చేసిన వ్యక్తి, వ్యవసాయం కోసం కానీ అతని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.
లేదా ఇక్కడ సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ భూమిని నాలా కన్వర్షన్ చేసి ప్రభుత్వానికి గజానికి లేదా గుంటకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కు పన్ను చెల్లించి విక్రయించుకోవచ్చును. కానీ ఇక్కడ నాల కన్వర్షన్ చేసుకోకుండా, ప్రభుత్వానికి, తాసిల్దార్ కార్యాలయం కు ఎటువంటి పన్నులు చెల్లించకుండానే సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇప్పటికే 10 ప్లాట్ల వరకు విక్రయించినట్లు తెలుస్తుంది.
గ్రామపంచాయతీ అనుమతి ఇవ్వలేదు
విలాసాగర్ లో వ్యవసాయ భూమిలో ప్లాట్లు పెట్టి విక్రయిస్తున్న వ్యక్తులకు స్థానిక గ్రామపంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే ప్లాట్లు పెట్టినా వ్యవసాయ భూమి నుంచి కనీలు తొలగించినట్లు, అక్కడ ప్లాట్లు కొనవద్దని ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికార దృష్టిలో పెట్టినట్లు కూడా చెప్పారు.
శేఖర్ సెక్రటరీ, గ్రామపంచాయతీ విలాసాగర్