‘కల్యాణలక్ష్మి’పేదింటి భరోసా

03-10-2026 | 05:25am
  1.    12 ఏళ్ల ప్రస్థానం.. లక్షల కుటుంబాలకు అండ  
  2. కేసీఆర్ మానవీయతకు నిదర్శనం
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాం తి) : ‘పేదింటి ఆడబిడ్డల పెళ్లిక ఆర్థిక భరోసా(Financial Security) కల్పించాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం(BRS government) ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన కళ్యాణలక్ష్మిపథకం(Kalyana Lakshmi Scheme) ఈనెల 2వ తేదీతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం కళ్యాణలక్ష్మి పథకం. తెలంగాణ ఉద్యమ(Telangana movement) సమయంలో ఒక గిరిజన తండా లో తాను స్వయంగా చూసిన ఒక ఘటనను ప్రేరణగా తీసుకొని కేసీఆర్(KCR) ఈ పథకానికి శ్రీకారం చుట్టారు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో అమల్లోకి తెచ్చిన కళ్యాణలక్ష్మిపథకం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం గా శుక్రవారం ట్విటర్ వేదికగా కేటీఆర్(KTR) స్పందించారు. తెలంగాణలోని లక్షలాది కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ మేనమామలా అండగా నిలబడ్డారని, పేద కుటుంబాలకు పెద్ద దిక్కయ్యారని కొనియాడారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,00,116 కానుకగా అం దించాలన్న ఆలోచన కేసీఆర్‌కు తప్ప ప్రపంచంలోని ఏ నాయకుడికి రాలేదని వెల్లడించారు.

ఆడబిడ్డ పెళ్లి సమయంలో తల్లిదండ్రు ల మీద ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఎంతగానో దోహపడిందని,  బాల్య వివాహాలను కూడా తగ్గించిందని స్పష్టం చేశారు. గడిచిన 12 ఏళ్లలో కళ్యాణల, షాదీముబారక్ ద్వారా 16.78 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చడమే కాకుండా.. పూర్తిగా రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

కళ్యాణలక్ష్మితో పాటు ఇస్తానన్న తులం బంగారం హామీని విస్మరించారని విమర్శించారు. కళ్యాణలక్ష్మి పథకమే లేకుండా చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నాడని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మి పథకం అమలులోకి వచ్చి శుక్రవారంతో 12 ఏళ్లు నిండిన శుభ సమయాన్ని పురస్కరించుకొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు