ఇబ్రహీంపట్నంలో అక్రమ ఫంక్షన్ హాల్‌పై చర్యలు

24-09-2026 | 03:28pm

​ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్24 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం ఖాల్సా ఉప్పరిగూడ రెవెన్యూ పరిధిలో (Uppariguda Revenue)ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఫంక్షన్ హాల్‌పై గురువారం విజయక్రాంతి దినపత్రికలో "అనుమతులు లేని ఫంక్షన్ హాల్‌పై చర్యలు ఏవి?" అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు.​

పోచారం నుండి మంగళపల్లి వెళ్లే రహదారిలో, సీవీఆర్ కళాశాల సమీపంలో 30 గుంటల విస్తీర్ణంలో అనుమతులు లేకుండా 'రీవేరా' ఫంక్షన్ హాల్‌ను నిర్మించి, గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొడుతూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. పత్రికా కథనం ఆధారంగా స్పందించిన అధికారులు ఫంక్షన్ హాల్ గేటుకు తాళం వేసి, అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీవేణి నందకుమార్, ఉప సర్పంచ్ ఎన్ను కావ్య వెంకటరెడ్డి, వార్డు సభ్యులు నరుకుడు మహేందర్, కొంగరి రవితేజ, ఎల్గపల్లి శ్రీనివాస్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు