రేవంత్ సర్కార్ కుట్ర

06-10-2026 | 05:45am

రామప్పకు ముప్పుతెచ్చే ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి 

  1. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడతాం 
  2. వారసత్వ కట్టడాలను ధ్వంసం చేస్తే ఊరుకోం
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అక్టోబర్ 5 (విజయక్రాంతి) : భూములను దోచుకోవడం పూర్తయిందని, ఇప్పుడు భూముల లోపల ఉన్న సంపదను దోచుకోవడంతో పాటు తెలంగాణ వారసత్వ కట్టడాలను(Telangana's heritage structures) ధ్వంసం చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్(Revanth Reddy's government) కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ(BRS Working President KTR)ర్ ఆరోపించారు. రామప్ప దేవాలయానికి(Ramappa Temple) అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని(Open-cast coal mine) ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.

తెలంగాణ శిల్పకళకు(Telangana Sculpture) ప్రతిరూపంగా, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా(UNESCO World Heritage Site) గుర్తించిన రామప్ప దేవాలయానికి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుచేయడం దారుణమని పేర్కొన్నారు. బొగ్గు తవ్వకాల కోసం భారీగా భూమిని తవ్వడంతో పాటు బ్లాస్టింగ్స్ నిర్వహిస్తే రామప్ప దేవాలయంతో పాటు రామప్ప చెరువుకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రామప్ప వంటి చారిత్రక, వారసత్వ కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం వాటికి ముప్పు కలిగించే ప్రాజెక్టులను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

అభివృద్ధి పేరుతో చారిత్రక వారసత్వాన్ని నాశనం చేయడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. రామప్ప దేవాలయానికి హాని కలిగించేలా ఉన్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు