ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అధికారులే వారధి
ఇబ్రహీంపట్నం :అక్టోబర్ 3(విజయక్రాంతి ) : ప్రభుత్వ పథకాలు(Government Schemes) మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు చేరినప్పుడే సర్కార్ లక్ష్యం నెరవేరుతుందని మల్‌రెడ్డి రంగారెడ్డి(Malreddy Ranga Reddy) తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అధికారులే వారధిప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అధికారులే వారధి ఇందుకోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అధికారులు వారధిగా పనిచేయాలన్నారు. శనివారం మంచాల మండల పరిషత్ కార్యాలయంలో(Manchala Mandal Parishad Office) అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ పథకాల అమలుతీరును సంబంధిత అధికారులను అడిగితెలుసుకున్నారు. అధికారులు హెడ్‌క్వార్టర్‌ను వదిలి, ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయన్నారు. ఆఫీస్‌కు వచ్చామా… వెళ్లిపోయామా అన్నట్టుగా విధి నిర్వహణ ఉండకూడదని ఎమ్మెల్యే తెలిపారు.
పంచాయతీ కార్యదర్శులే కీలకం
గ్రామాల అభివృద్ధి, పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ముందుకెళ్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ఉండే పంచాయతీ కార్యదర్శులే కీలకమని తెలిపారు. గ్రామంలో సమస్యను గుర్తించి, సంబంధితశాఖాధికారికి సమాచారమివ్వాలని . ప్రతీరోజూ ఏయే అధికారి గ్రామంలో పర్యటిస్తున్నారనేది గ్రామపంచాయతీలో రికార్డు మెయిన్‌టెయిన్ చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, రోడ్లు పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలును నిత్యం పర్యవేక్షించాలన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జీపీవోలతో సమన్వయంతో గ్రామాల అభివృద్ధి సెక్రటరీలు ముందుండి పనిచేయాలన్నారు.
రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు మండలానికి నిధులిచ్చామని… ఒక్కో గ్రామానికి సుమారుగా మూడు కోట్లు అందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంచాల మండల రూపురేఖలు మార్చేందుకు చేసే ప్రయత్నంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సరఫరా పట్ల ప్రత్యేకంగా కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఉండకూడదని స్పష్టం చేశారు.