సర్వే నంబర్ 42లో భూ వివాదానికి తెర!
26-10-2026 | 05:04pm
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి సర్వేతో పరిష్కార దిశగా అడుగులు
మణికొండ, అక్టోబర్ 26 (విజయక్రాంతి): పంచవతి పరిధిలోని సర్వే నంబర్ 42లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదం(Land Dispute) ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ అధికారులు డీఐ, ఆర్ఐ సురేష్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారుల సమక్షంలో స్థలాన్ని సర్వే చేసి హద్దులను నిర్ధారించినట్లు సమాచారం. సర్వే నంబర్ 41 పరిధిలోనూ హద్దులను పరిశీలించి గుర్తించినట్లు తెలిసింది.