గోదావరే దిక్కు!
- హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సర్కారు ఫోకస్
- ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నింపడంపై దృష్టి
- మూసీ నది పునరుజ్జీవానికి కొత్త ప్రణాళిక
- రూ.7,360 కోట్ల ప్రాజెక్టుకు రూ.2,944 కోట్ల హడ్కో రుణం
- రుణానికి ప్రభుత్వం గ్యారంటీ.. అసలు, వడ్డీకి బడ్జెట్ మద్దతు
- 2 శాతం గ్యారంటీ కమిషన్ మినహాయింపు
అక్టోబర్ 5 (విజయక్రాంతి) : తెలంగాణలో కరువు ఛాయలు కనిపించిన ప్రతిసారీ తెరపైకి వచ్చేది నీటి సమస్యే. వర్షాలు సమృద్ధిగా ఉంటే చెరువులు, రిజర్వాయర్లు నిండుతాయి. లేదంటే భూగర్భ జలాలకు(Groundwater) కొరత ఏర్పడుతుంది. వరుసగా వర్షాభావ పరిస్థితులు(Rain-deficient conditions) ఏర్పడితే తాగునీటి వనరులపైనా(Drinking water resources) ప్రభావం పడుతుంది. మరోవైపు హైదరాబాద్(Hyderabad) వంటి మహానగరాల్లో జనాభా, నిర్మాణాలు, పారిశ్రామిక అవసరాలు(Industrial requirements) పెరుగుతున్న కొద్దీ నీటి డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది.
ఈ రెండు పరిస్థితుల మధ్య తెలంగాణ భవిష్యత్ నీటి భద్రతకు నదీ జలాలే కీలక ఆధారంగా మా రుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జలాల ను తాగునీటి అవసరాలకు వినియో గించు కోవడం, మూసీ నదిని పునరుజ్జీవం వంటి చర్యలు రాష్ట్ర దీర్ఘకాలిక నీటి ప్రణాళికలో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. వర్షాలపై ఆధారపడే ప్రాంతాల్లో వర్షాభావ ప్ర భావం కేవలం వ్యవసాయానికే పరిమితం కాదు. తాగునీటి వనరులు కూడా క్రమంగా తగ్గుతాయి. చెరువులు, కుంటలు, చిన్న జలాశయాలు ఎండిపోవడం, భూగర్భ జలాల నీటిమట్టం పడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో నదు ల నుంచి నీటిని తరలించే సామర్థ్యం ఉన్న భారీ మౌలిక వసతులు కీలకంగా మారతాయి. అందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి భవిష్యత్ తాగునీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను మరింత గా వినియోగించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఇందులో భాగంగా గోదావరి తాగునీటి సరఫరా పథకం రెండవ, మూడవ దశలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నింపి మూసీ నదిని పునరుజ్జీవింపజేసే పనులకు రూ.7,360 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హెచ్ఏఎం)లో చేపట్టాలనినిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40శాతం ప్రభుత్వ వాటా కాగా, 60 శాతం మొత్తాన్ని అమలు సంస్థ పెట్టుబడిగా సమకూర్చనుంది. ప్రభు త్వ వాటాగా ఉండే రూ.2,944 కోట్లను హడ్కో రుణం ద్వారా సమీకరించారు.
రూ.2,944 కోట్ల రుణానికి సర్కారు గ్యారంటీ...
హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఈ ప్రాజెక్టు కోసం హడ్కో నుంచి రూ.2,944 కోట్ల టర్మ్ లోన్ తీసుకుంది. ఇందుకు సంబంధించి 2026 జనవరి 6న రుణ ఒప్పం దం కుదిరింది. అయితే ఇంత భారీ మొత్తంలో రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ అవసరం కావడంతో ప్రభుత్వం ఆ బాధ్యతను స్వీకరించి ంది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో రుణం అసలు, వడ్డీ చెల్లింపులకు మొత్తం రుణ కాలపరిమితి వరకు రాష్ట్ర బడ్జెట్ నుంచి మద్దతు అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీంతో ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణం తిరిగి చెల్లించే బాధ్యత విషయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీకి ప్రభుత్వ భరోసా లభిం చింది. రుణ ఒప్పందంలోని నిబంధనలను సంస్థ పాటించాల్సి ఉండగా.. హడ్కోకు చెల్లి ంచాల్సిన మొత్తాల విషయంలో రాష్ట్ర బడ్జెట్ మద్దతు కీలకంగా మారనుంది. రాష్ట్ర ప్రభు త్వ గ్యారంటీకి సాధారణంగా చెల్లించాల్సిన 2 శాతం గ్యారంటీ కమిషన్ నుంచి కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీకి మినహాయింపు ఇచ్చారు. దీంతో రూ.2,944 కోట్ల రుణంపై గ్యారంటీ కమిషన్ రూపంలో అదనపు భా రం ఉండదు.
హడ్కో నుంచి రుణం.. రుణానికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ.. అసలు, వడ్డీ చెల్లింపులకు బడ్జెట్ మద్దతు ద్వారా రుణ సమీకరణలో మూడు స్థాయిల్లో ఆర్థిక భరో సా లభిస్తోంది. దీనికి తోడు గ్యారంటీ కమిషన్ మినహాయింపు కూ డా లభించింది. హడ్కో రు ణంపై మొదట 8.97 శాతం వడ్డీ రేటు ఉండగా దానిని 8.85 శాతానికి తగ్గించారు. గోదావరి తాగునీటి సరఫరా, మూసీ పునరు జ్జీవన పనుల కోసం రుణాన్ని వినియోగిస్తున్నట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ప్రభుత్వాని కి వివరించింది. ప్రభుత్వ వాటాకు బడ్జెట్ మద్దతు ఉంటుందని హామీ ఇవ్వడంతో రు ణ సమీకరణకు మార్గం సుగమమైంది. ప్రా జెక్టు ఆర్థిక నిర్మాణంలో ప్రభుత్వం నేరుగా బాధ్యత తీసుకోవడం ద్వారా పనులను ము ందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.
కరువు వేళ కాళేశ్వరానికి ప్రాధాన్యం..
మూసీ పునరుజ్జీవనం పేరుతో కేవలం నది సుందరీకరణకే పరిమితం కాకుండా దానికి అవసరమైన నీటి ప్రవాహాన్ని కూడా సమకూర్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను కీలకంగా పరిగణిస్తున్నారు. ఈ రెండు జలాశయాలు హైదరాబాద్ చరిత్రలోనే కీలకమైన తాగునీటి వనరులు. నగరం విస్తరించిన కొద్దీ వీటి ప్రాధాన్యం తగ్గినా.. ఇప్పుడు మళ్లీ వాటిని నీటి వ్యవస్థలో కీలక భాగంగా వినియోగించుకునే ప్రయత్నం జరుగుతోంది.
గోదావరి నీటిని ఈ రిజర్వాయర్లకు తరలించడం ద్వారా ఒకవైపు నగర తాగునీటి భద్రతకు తోడ్పాటు ల భించడంతో పాటు మరోవైపు మూసీ నదికి నీటి ఆధారం కల్పించే అవకాశం ఏర్పడుతుంది. గోదావరి జలాలను హైదరాబాద్ వరకు తీసుకురావడం, వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడం వంటి అంశాలు చర్చకు వచ్చిన ప్రతిసారీ కాళేశ్వరం వంటి భారీ నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం సంతరించుకుంటుంది. తాజా ఉత్తర్వుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నేరుగా ప్రస్తావనకు రాకపోయినా గోదావరి నీటిని వినియోగించు కునే సామర్థ్యం, భారీ ఎత్తిపోతల వ్యవస్థలు, నీటి నిల్వతరలింపు మౌలిక వసతుల అవసరం మాత్రం స్పష్టమవుతోంది.
కరువు సమయంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల నుంచి అవసరమైన ఏరియాలకు నీటిని తరలించడం కీలకం. అందుకు భారీ పంపింగ్ వ్యవస్థలు, రిజర్వాయర్లు, పైప్లైన్లు, కాలువలు వంటి మౌలిక వసతులు అవసరం. ఇప్పటికే నిర్మించిన మౌలిక వసతులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలా వినియోగించుకోవాలన్నది కీలక అంశంగా మారుతోంది. కరువు, తాగునీటి ఎద్దడి వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గోదావరి జలాలను వినియోగించుకునే సామర్థ్యం ఉన్న ప్రతి మౌలిక వసతినీ సమర్థంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.