శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
06-10-2026 | 09:08am
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో బుల్లెట్ (Bullet) కలకలం రేపింది. శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద తనిఖీల్లో బుల్లెట్‌ను అధికారులు గుర్తించారు.సెక్యూరిటీ తనిఖీల్లో బుల్లెట్ బయటపడటంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం జీఎంఆర్ ఔట్‌పోస్ట్ పోలీసులకు (GMR Outpost Police) అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.