ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు

06-11-2026 | 10:30pm

 సీఐ వెంకట్ రెడ్డి

సిర్గాపూర్ నవంబర్ 06(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండలం దీపావళి పండుగ(Festival of Diwali) సందర్భంగా గ్రామాల్లో ఎవరైనా పేకాట (లేదా) ఇతర జూద కార్యకలాపాలకు(gambling activities) పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి(Kangti CI Venkat Reddy) శుక్రవారం పత్రిక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... సిర్గాపూర్, కల్హేర్, కంగ్టి మండలం, మండల పరిధిలోని గ్రామాల్లో ఎక్కడైనా జూదం (పేకాట) ఆడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జూదం వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. యువత జూదానికి దూరంగా ఉండాలని, దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని సీఐ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు