125 కేజీల కాపర్ వైర్ స్వాధీనం
మునిపల్లి అక్టోబర్ 17 ( విజయక్రాంతి ): జోగిపేట మర్పల్లి(Jogipet Marpalli) మునిపల్లి మండలాల్లో ఇటీవల చోరీకి గురైన కాపర్ వైర్ దొంగలను(Copper wire thieves) మునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి మునిపల్లె ఎస్సై అరవింద్(Munipalle SI Arvind) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాంగ్య నాయక్(Sangya Nayak) చెందిన 8 మంది వివిధ ప్రాంతాల్లోని సోలార్ ప్లాంట్ లో గతంలో పని చేశారు. అయితే పని విడిచిపెట్టి ఆటో డ్రైవర్ గా అవతారం ఎత్తి జలతాలకు బానిస అయ్యారు. దీంతో కాపర్ వైర్లు దొంగతనం చేసి సంపాదించుకుందామనే ఉద్దేశంతో దొంగతనాలకు అలవాటు పడ్డారు.
ఈ క్రమంలో ఇటీవల జోగిపేట, మర్పల్లి , మునిపల్లి మండలాల్లో ఉన్న సోలార్ ప్లాంట్లపై(Solar plants) వారి కన్ను పడింది. దీంతో గతంలో సోలార్ ప్లాంట్లలలో చేసిన అనుభవంతో మునిపల్లి పెద్దచెల్మెడ గ్రామ శివారులో ఉన్న సోలార్ ప్లాంట్ ను లక్ష్యంగా ఈ నెల11న దొంగతనానికి పాల్పడ్డారు. ఈ మేరకు ప్లాంట్ యాజమాన్యం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మునిపల్లి పోలీసులు దర్యాపు చేపట్టారు.
విచారణలో భాగంగా ఇటీవల కేతవత్ ప్రవీణ్ తన స్నేహితుల తో కలిసి ఫోన్ ద్వారా కలుసుకొని అక్కడ నుంచి సంగారెడ్డి చౌరస్తా మీదుగా నువ్వునావత్ గోపాల్ ను ఆటోలో ఎక్కించుకొని పెద్దచెల్మెడ సోలార్ ప్లాంట్ లోకి చొరపడి అందులో ఉన్న కేబుల్ వైర్లను కటింగ్ పరికరాల తో కత్తిరించి వాటిని చుట్టలుగా కటి సంచుల్లో నింపారు.
అక్కడినుంచి కంకోల్, బుదేరా చౌరస్తా మీదుగా జోగిపేట వైపు వెళ్లి పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామ శివారులో గల గట్టు ప్రాంతంలో ఈ నెల 12వ తేదీన తెల్లవారుజామున కేబుల్ వైర్లను తగలబెట్టి అందులో ఉన్న కాపర్ వైర్లను వేరు చేసినట్టు విచారణలో తేలిందని ఎస్ఐ తెలిపారు. కాల్చిన కాపర్ వైర్లను జీడిమెట్ల లోని స్టాప్ వ్యాపారి మహమ్మద్ జిల్లాని వద్దకు తీసుకెళ్లి విక్రయించినట్లు దర్యాప్తు లో వెళ్లడైనట్టు ఎస్సై తెలిపారు.
ఈ మేరకు కాపర్ వైర్లను దొంగలించిన 8మందితో పాటు స్క్రాప్ వ్యాపారి మహమ్మద్ జిలాని ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్టు ఎస్సై తెలిపారు. కాగా దొంగలించిన కాపర్ వైరు 125 కేజీలు ఉంటుందని, దీని విలువ రూ. 143,750 ఉందని మునిపల్లె ఎస్సై అరవింద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో హనీఫ్, తుకారం, పాండు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.