వివేకానంద పార్క్‌ను సందర్శించిన మాజీ కార్పొరేటర్
22-09-2026 | 08:39pm
రామచంద్రపురం ఆగస్టు 22: భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి(Former Corporator Sindhu Adarsh Reddy) ఓల్డ్ ఎంఐజీ కాలనీలోని వివేకానంద పార్క్‌ను యు.బి.డి మేనేజర్ సతీష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతు తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో పార్క్ అభివృద్ధికి ప్రతిపాదించిన ప్లే ఎక్విప్మెంట్స్, ఓపెన్ జిమ్, మల్టీపర్పస్ కోర్టు తదితర పనుల పురోగతిపై యు.బి.డి మేనేజర్ సతీష్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్క్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులు, యువతకు అందుబాటులోకి తీసుకురావాలని సింధు ఆదర్శ్ రెడ్డి కోరారు.