నాగల్‌గిద్ద యువతకు ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్

05-10-2026 | 10:31pm

నాగల్‌గిద్ద, అక్టోబర్ 5 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని యువతీ యువకులు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు ఉచిత కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై కాశీపురం రామకృష్ణ(SI Kasipuram Ramakrishna) కోరారు. సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్, కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 3 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 10 నుంచి 45 రోజుల పాటు సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్‌లో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల యువతీ యువకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లేదా క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు