భగవద్గీత పారాయణం.. పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు!

01-11-2026 | 01:17pm

రామచంద్రపురం, నవంబర్ 1 (విజయక్రాంతి): భారతి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. (Bhagavad Gita Chanting) సుమారు 5 వేల మంది మాతృమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ముఖ్యంగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సి. భద్రారెడ్డి, సి. ప్రీతి రెడ్డి, మాజీ మంత్రి మల్లా కుమారుడు, కోడలితో పాటు రామచంద్రపురం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్, భారతి నగర్ సీనియర్ బీజేపీ నాయకులు కృష్ణమూర్తి చారి, రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Spiritual Gathering)

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. హిందువుగా జీవించడం, హిందూ సంప్రదాయంలో జన్మించడం గొప్ప వరమని అన్నారు. (Indian Traditions) దేశ సరిహద్దులు, ఖండాలు దాటిన మన సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పటికీ మరువకూడదని సూచించారు. సనాతన ధర్మం వల్లే ప్రపంచానికి మేలు జరుగుతోందని అన్నారు. (Sanatana Dharma)

మరిన్ని వార్తలు