వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్సై అరవింద్ కుమార్

17-09-2026 | 10:35pm

మునిపల్లి సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్సై  అరవింద్ కుమార్(SI Arvind Kumar) సూచించారు. చెరువులు, బావుల వద్ద నిమజ్జనం చేసే సమయంలో చిన్నపిల్లలు నీటి దగ్గరకు వెళ్లకుండా తల్లిదండ్రులు, నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా వినాయక కమిటీ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ముందస్తుగా ఏవైనా సమస్యలు, ఆటంకాలు ఉంటే మునిపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని ఎస్సైఅరవింద్ కోరారు.

మరిన్ని వార్తలు