వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు
రామచంద్రపురం ఆగస్టు 24: భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి (Sindhu Adarsh Reddy, former Corporator of Bharathinagar Division) రామచంద్రాపురం డివిజన్లోని అవతార్ అపార్ట్మెంట్స్, మల్లికార్జున్ నగర్, భారతీనగర్ డివిజన్ ఎల్ఐజీ కాలనీలలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలలోని పార్కుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కూడా సందర్శించి, భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం ఎల్ఐజీ కాలనీలో మహేష్ ఆధ్వర్యంలో వైష్ణవి యూత్ అసోసియేషన్ నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించారు.ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగన్నాథ్ రెడ్డి, ఎల్ఐజీ కాలనీ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.