ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మ దహనం
08-09-2026 | 02:19pm
నంగునూరు, (విజయక్రాంతి): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బిఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం నంగునూరు మండల కాంగ్రెస్ నాయకులు తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాంపూర్ క్రాసింగ్ వద్ద కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు.