గజ్వేల్‎లో టెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోపులాట

08-09-2026 | 12:17pm

సిద్దిపేట: మర్కుక్ మండలం దామరకుంట వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా, కాంగ్రెస్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగినట్లు సమాచారం.

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ నేతలు ఎర్రవల్లిలో డప్పులతో నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలకు పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాస పరిసరాల్లో 144 సెక్షన్ విధించి, వెంకటాపూర్, ఎర్రవల్లి శివారులో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు