హరీశ్‌రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ గుస్సా

08-09-2026 | 11:11am

హైదరాబాద్: మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత, కోవా లక్ష్మి తనకు తోబుట్టువులతో సమానమని స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) అన్నారు. సబితమ్మ ఘటనపై తానే విచారణ జరిపించాలని సూచించానని తెలిపారు. మహిళా సభ్యులపై దురుసు ప్రవర్తనపై నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హరీశ్‌రావుతో వాగ్వాదం సందర్భంగా స్పీకర్ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీకు కాదు ఆవేశం.. నాకు ఉండాలి’’ అంటూ హరీశ్‌రావును ప్రశ్నించారు. తన మాటలు వినకుండా ఎందుకు ఆవేశం వ్యక్తం చేస్తున్నారని నిలదీశారు.

మరిన్ని వార్తలు