గుర్తుతెలియని డెడ్‌బాడీస్.. హత్యలా..? ఆత్మహత్యలా..?
08-09-2026 | 03:17pm
తాండూరు, సెప్టెంబర్ 8, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులో మంగళవారం రెండు గుర్తు తెలియని శవాలు లభ్యమయ్యాయి. అయినెల్లి(Ainavilli)- జినుగుర్తి(Jinugurthi) గ్రామాల మధ్యన ఉన్న అసంపూర్తిగా నిర్మించిన ఇళ్ల సమీపంలో ఓ మహిళా, ఓ పురుషుడు కుళ్ళిపోయిన శవాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శవాల వద్ద పురుగుల మందుల డబ్బా లభించాయి. ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమెరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు.