తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
08-09-2026 | 10:22am
హరీశ్‌రావు, స్పీకర్ మధ్య వాగ్వాదం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి అంశాన్ని హరీశ్‌రావు సభలో ప్రస్తావించారు. ‘మహిళా సభ్యులపై దాడి జరిగితే మీరు స్పందించరా స్పీకర్ గారు? ఇదేమైనా కౌరవ సభనా?’ అంటూ స్పీకర్‌ను ప్రశ్నించారు. దీంతో హరీశ్‌రావు, స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. ‘మీరు లొల్లి పెడితే నేను భయపడను’ అంటూ స్పీకర్ బదులిచ్చారు.
