రేవంత్..చిల్లర నా కొడుకు: కేటీఆర్

08-09-2026 | 01:15pm

హైదరాబాద్: ఎర్రవల్లి నివాసానికి వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలను పోలీసులు హకీంపేట వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు ఎస్కార్ట్ ఇస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులపై తమకు నమ్మకం లేదని, కేసీఆర్‌ను తామే కాపాడుకుంటామని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. గూండాలతో కేసీఆర్‌ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. 

మరిన్ని వార్తలు