కళాశాలలో ముందస్తు.. బతుకమ్మ వేడుకలు
కోహెడ, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళశాలలో(Government Junior College) ముందస్తు బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్(District Intermediate) విద్యాధికారి రవీందర్ రెడ్డి(Ravinder Reddy) హాజరైయారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి(Telangana Culture), ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. ప్రకృతిని పూజించే ఒక గొప్ప పండుగ అన్నారు. తీరొక్క పూలన్నింటినీ తెచ్చి, ఎంతో కళాత్మకంగా, గోపురం ఆకారంలో పేర్చి, బతుకమ్మను తయారుచేయడం ఆడబిడ్డలంతా ఒక దగ్గర చేరి లయబద్ధంగా పాటలు పాడటం మన సంస్కృతికి నిదర్శనం అన్నారు. కాగా విద్యార్థినిలు అలరించిన ఉత్సవాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కందాల వెంకటేశం, వార్డు మెంబర్లు జగన్, శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు యాదగిరి, రాజమౌళి ,రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, నీరజ, రజిత, సుజాత ,నరేష్ అశోక్ సీతారామయ్య,యు. శ్రీనివాస్, చిరంజీవి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.