పరస్పర గౌరవంతోనే మహిళా పోలీసుల సాధికారత

13-10-2026 | 08:30pm

సీపీ రష్మీ పెరుమాళ్ 

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 13: పోలీస్ శాఖలో మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సీపీ రష్మీ పెరుమాళ్(CP Rashmi Perumal) అన్నారు. పరస్పర గౌరవం, సహకారంతో పనిచేస్తూ ఆరోగ్యకరమైన కార్యాలయ సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ లో ‘జెండర్ సెన్సిటైజేషన్’(Gender Sensitization) పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మహిళా పోలీస్ సిబ్బందితో   సంభాషించారు. పోలీస్ శాఖలో లింగ సమానత్వం, మహిళల పాత్ర, ఎదుర్కొంటున్న సవాళ్లు, పని ప్రదేశంలో అనుకూల వాతావరణం కల్పించడంపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు.

పని ప్రదేశంలో ప్రతి మహిళా ఉద్యోగికి తగిన ప్రాధాన్యత, రక్షణ, గౌరవం లభించేలా సురక్షితమైన, సమ్మేళిత  వాతావరణాన్ని అందించడం అత్యంత ముఖ్యమని సీపీ స్పష్టం చేశారు. మహిళా పోలీసులు తమ అభిప్రాయాలను, క్షేత్రస్థాయి అనుభవాలను, సమస్యలను సీపీ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు