పెద్దపల్లి ఎస్‌ఐగా రాజశేఖర్

13-10-2026 | 08:59pm

బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి, అక్టోబర్ 13(విజయ క్రాంతి): పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా గుమ్ముల రాజశేఖర్(Gummula Rajasekhar as Police Station Sub-Inspector) నియమితులయ్యారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Police Commissioner Amber Kishore Jha) మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌ను పెద్దపల్లి ఎస్‌ఐగా బదిలీ చేశారు. పెద్దపల్లి ఎస్‌ఐగా పనిచేస్తున్న నరేష్‌ను మంచిర్యాల సీసీఎస్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు