ఆహార భద్రతా అధికారి ఆకస్మిక తనిఖీలు

13-10-2026 | 08:52pm
  1. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల తొలగింపు
  2. నిబంధనలు పాటించని వ్యాపారులకు నోటీసులు

కామారెడ్డి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ఆహార భద్రతా అధికారి జి. విక్రమ్(Food Safety Officer G. Vikram) మంగళవారం పలు చిల్లర దుకాణాలు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొన్ని దుకాణాల్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించి, వాటిని వెంటనే తొలగించి పారవేయించారు.

నాణ్యతపై అనుమానం ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం అవసరమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  లైసెన్స్ లేదా నమోదు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలు సంస్థలను గుర్తించి, సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆహార భద్రతా అధికారి విక్రమ్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపారి తప్పనిసరిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేదా నమోదు కలిగి ఉండాలని సూచించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంపై ఆహార భద్రతా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు