హిందూ శ్మశాన వాటిక స్థలంలో ఫ్రీకాస్టింగ్

13-10-2026 | 09:04pm

పనులను అడ్డుకున్న మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి 

ఎల్బీనగర్, అక్టోబర్ 13: హయత్ నగర్‌లోని మునుగనూర్ రోడ్ లో ఉన్న హిందూ స్మశాన వాటికకు సంబంధించిన స్థలంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫ్రీకాస్టింగ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్(Former Corporator Navajeevan Reddy) రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి అక్కడికి చేరుకుని నిర్మాణ పనులను నిలిపివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్మశాన వాటిక అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినదని, అటువంటి స్థలంలో ఎవరికి కనీస సమాచారం ఇవ్వకుండా నిర్మాణ పనులు చేపట్టడం సమంజసం కాదన్నారు. శ్మశాన వాటిక భూమికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు