ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు
జేసీబీ స్వాధీనం.. కేసు నమోదు
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 22: ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న జేసీబీని సిద్దిపేట రూరల్ పోలీసులు(Siddipet Rural Police [seized/took into custody] the JCB.) స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఇర్కోడ్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 780లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి సిద్దిపేట పరిసర ప్రాంతాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అధికారులు చర్యలు చేపట్టారు.
తహశీల్దార్ ఆదేశాల మేరకు ఇర్కోడ్ గ్రామ జీపీఓ మెట్ల రాజ్‌కుమార్, వీఆర్ఏ మహేష్ బుధవారం ఉదయం 11 గంటలకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, జేసీబీతో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. జేసీబీ ఇర్కోడ్‌కు చెందిన కుంభం సురేష్‌రెడ్డికి చెందినదిగా, డ్రైవర్ కుచుల యాదగిరి దానిని నడుపుతున్నట్లు విచారణలో తేలింది. జీపీఓ ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డి. నవత తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.