కాంగ్రెస్‎లో చేరిన పెద్దమతారి బాబు

27-09-2026 | 02:35pm

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ఎమ్మార్పీఎస్(MRPS) సీనియర్ నాయకులు పెద్దమతారి బాబు తన అనుచరులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్(Minister Gaddam Vivek) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘ వర్గీకరణ సాధన ఉద్యమంలో అలుపెరుగని కృషి చేసిన నాయకు ప్రజా సేవలో నిమగ్నం అవ్వాలని రాజకీయ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే కార్యకర్తలు నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని మంత్రి వివేక్ తెలిపారు.

సిద్దిపేటలో పార్టీ బలపడుతుందని రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం ఖాయమని వెల్లడించారు. బాబు తోపాటు బొందనీ రాజమల్లు, రోమాల బాబు, ధర్మారం ఎల్లం, కాకి రాజు, కోడూరు బాలరాజు, బూరుగు యాదగిరి, బాకూరి అశోక్, గుండుకాడి భూపతి, వేముల శ్రీనివాస్, గోపని చంద్రం,  తూటి జహంగీర్, మాదాసు బాబులు సతీష్ మాదిగ, అల్లారం రత్నయ్య ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు