భారత మహిళలదే సిరీస్

19-10-2026 | 05:25am
  1. రెండో టీ20లోనూ జింబాబ్వే చిత్తు
  2. చెలరేగిన షెఫాలీ, స్మృతి మంధాన

రాయ్‌పూర్, అక్టోబర్ 18 : భారత మహిళల క్రికెట్ జట్టు(Indian women's cricket team) కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన తన ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ కైవసం చేసుకుంది. బౌలర్లు సమిష్టిగా రాణించగా, బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ, స్మృతి మంధాన చెలరేగారు. ఫలితంగా భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సా ధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. టిరిపానో 34, కెప్టెన్ నకోమో 27 (నాటౌట్) పరుగులు చేశారు.ముగ్గురు డకౌట్లు కాగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.నికీ ప్రసాద్ 2, క్రాంతి గౌడ్, నందిని శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. భారత్ కేవ లం 8.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పో యి టార్గెట్‌ను అందుకుంది. షఫాలీ వర్మ (55), స్మృతి మంధన (47 నాటౌట్) చెలరేగారు. షఫాలీ గెలుపు వాకిట ఔట్ కాగా.. అ నుష్క శర్మ (1 నాటౌట్) సహకారంతో మం ధన మ్యాచ్‌ను ముగించింది. ఈ సిరీస్‌లో నామామాత్రపు చివరి టీ20 రాయ్‌పూర్ వేదికగా మంగళవారం జరుగుతుంది. తర్వా త ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ అక్టోబర్ 23 నుంచి మొదలవుతుంది.

స్కోర్ బోర్డు

జింబాబ్వే ఇన్నింగ్స్ : 102/8 ( టిరిపానో 34, జోస్‌ఫైన్ 27 ; నిక్కి ప్రసాద్ 2/7. క్రాంతి గౌడ్ 1/15, నందని శర్మ 1/17)

భారత్ ఇన్నింగ్స్ : 104/1 (8.5 ఓవర్లు) (షెఫాలీ వర్మ 55, స్మృతి మంధాన 47 నాటౌట్, ; బిజా 1/9 )

మరిన్ని వార్తలు